వీఐటీ విద్యార్థులకు మోటార్క్ ఆఫర్.. కోటీ ప్యాకేజీతో
తమిళనాడులోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ)కి చెందిన ఇద్దరు విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో రూ.1.02 కోట్లవార్షిక వేతన ఆఫర్‌ను అందుకున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న అమిత్ అగర్వాల్, సార్థక్భరద్వాజ్కు మోటార్క్ కంపెనీ ఈ ఆఫర్ ప్రకటించింది. 2023 బ్యాచ్‌కు చెందిన మొత్తం 184 మంది గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులు తమ వేసవి ఇంటర్న్‌షిప్ సమయంలో వివిధ కంపెనీల నుంచి ప్రీప్లెస్మెంట్ ఆఫర్లు అందుకున్నట్టు వీఐటీ ఒక ప్రకటనలో తెలిపింది.






