Ind Vs Eng: ఆ క్రికెటర్ కు ఆవగింజంత అదృష్టం లేదా..?

అంతర్జాతీయ క్రికెట్ లో ఎంత టాలెంట్ ఉన్నా సరే కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఈ విషయంలో యువ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ స్పష్టమైన ఉదాహరణ. గత ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల సీరీస్ కు అతను ఎంపికైన సరే తుది జట్టులో ఆడలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు కూడా అతనిని ఎంపిక చేశారు. అక్కడ కూడా ఒక్క అవకాశం ఉంటే ఒక్కటి కూడా రాలేదు. దేశవాళి క్రికెట్లో మంచి బ్యాట్స్మెన్ గా అతనికి గుర్తింపు ఉంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్ కు అతనిని ఎంపిక చేశారు.
కానీ ఒక్క అవకాశం కూడా రాలేదు. అతని తర్వాత జట్టుకు ఎంపికైన సాయి సుదర్శన్, కరుణ్ నాయర్(Karun Nair).. తుది జట్టులో ఆడారు. సాయి సుదర్శన్(Sai Sudarshan) మొదటి టెస్ట్ లో ఆడగా, నాయర్ 3 టెస్టులు ఆడాడు. కానీ ఇప్పటివరకు అభిమన్యు ఈశ్వరన్ కు మాత్రం అవకాశం కల్పించలేదు. దీనితో అతన్ని మిడిల్ ఆర్డర్లో నాలుగో టెస్ట్ కు ఆడించే అవకాశాలు ఉండొచ్చు అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఓపెనర్ గా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఎక్కడైనా సరే రాణించగలిగే సత్తా ఉన్న ఆటగాడు అభిమన్యు.
దీంతో అతనికి అవకాశం కల్పించాలనే డిమాండ్లు వినపడుతున్నాయి. ఫీల్డింగ్ విషయంలో కూడా అతను సత్తా చాటుతూ ఉంటాడు. ఇంగ్లాండ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా అతను మెరుగ్గా రాణించాడు. దీనితో అతనికి అవకాశం ఇస్తే బాగుంటుందని అభిమానులు సైతం కోరుతున్నారు. అయితే జట్టు కూర్పు విషయంలో కొన్ని లెక్కలు వేసుకుంటున్న, హెడ్ కోచ్ గంభీర్ అలాగే కెప్టెన్ గిల్ అతనికి అవకాశం కల్పించలేక ఇబ్బంది పడుతున్నారు.
అయితే నాలుగో టెస్ట్ లో ఏది ఏమైనా సరే అతనిని మిడిల్ ఆర్డర్లో ఆడించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రెండు మూడు టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ వైఫల్యం స్పష్టంగా కనపడింది. ముఖ్యంగా కరుణ్ నాయర్ విఫలం కావడంతో, అతని స్థానంలో మరొకరిని ఆడించాలని డిమాండ్లు బలపడుతున్నాయి. మొదటి టెస్ట్ లో కూడా భారీ స్కోర్ చేసే అవకాశం ఉన్నా సరే మిడిల్ ఆర్డర్ ఫెయిల్ కావడంతో జట్టు ఓటమిపాలైంది. మూడో టెస్టులో కీలకమైన సమయంలో వికెట్లు కోల్పోవడం విజయాన్ని ప్రభావితం చేసింది. అందుకే మిడిల్ ఆర్డర్ ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.