Vivek Ramaswamy : మస్క్‌తో విభేదాలు …క్లారిటి ఇచ్చిన వివేక్ రామస్వామి
టెక్ దిగ్గజం, ట్రంప్ మంత్రివర్గ సభ్యుడు ఎలాన్ మస్క్ (Elon Musk )తో ఎటువంటి విభేదాలు లేవని, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డీఓజీఈ-డోజ్) నుంచి తప్పుకోవడానికి మస్క్ కారణం కాదని వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) స్పష్టం చేశారు. డోజ్‌లో కీలకపాత్ర పోషించిన రామస్వామి వారం రోజుల క్రితం తప్పుకున్న విషయం తెలిసిందే. కాగా మస్క్ మందలించినందువల్లే తప్పుకున్నారా అన్న ప్రశ్నకు వివేక్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఓహియో గవర్నర్ (Ohio Governor ) ఎన్నికల్లో పాల్గొనేందుకోసమే డోజ్ (Doze)నుంచి తప్పుకున్నారని భావిస్తున్న నేపథ్యంలో రామస్వామి మాట్లాడుతూ ఫెడరల్ బ్యూరోక్రసీని ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశించిన డోజ్‌కు ఎలాన్ మస్క్ నేతృత్వం వహిస్తుండగా మా ఇద్దరి ఆలోచనలు ఒక్కటేనని చెప్పుకొచ్చారు. డోజ్ వంటి టెక్నాలజీకి సంబంధించిన శాఖపై ఎలాన్ మస్క్ కన్నా మించిన వ్యక్తి మరొకరు లేరని స్పష్టం చేశారు. నేను రాజ్యాంగం, చట్టసభలు, పాలన వంటి అంశాలపై దృష్టి పెడుతున్నానని, ఓహియొ గవర్నర్ ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలున్నాయనని, మస్క్ ఆలోచనంతా టెక్నాలజీపైనే ఉంటుందని అన్నారు. తమ ఇద్దరి మద్య ఎటువంటి విభేదాలు లేవని మరోమారు స్పష్టం చేశారు.






