Nimisha Priya:బ్లడ్‌మనీకి అంగీకరించం … ఆమెకు శిక్ష పడాల్సిందే

కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసులో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు అమలుకావాల్సిన ఆమె మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం (Yemeni government) తాత్కాలికంగా వాయిదా వేడయంతో కాస్త ఊరట లభించింది. అయితే మృతుడు తలాల్ అదిబ్ మెహది (Talal Adib Mehdi) కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడు సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ (Abdul Fattah Mehdi) స్పష్టం చేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్‌మనీ (Bloodmoney) కి అంగీకరించబోమని వెల్లడిరచారు. మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. అలాగే మేం ఎదుర్కొన్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవు. ఈ వాయిదాను మేం ఉహించలేదు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం. మాకు న్యాయం దక్కాల్సిందే అని అన్నారు. అలాగే దోషిని బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని వ్యాఖ్యానించారు.