India : భారత్‌కు మరోసారి అమెరికా హెచ్చరిక

రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారత్ (India)సహా ఇతర దేశాలపై 500 శాతం సుంకాలను విధిస్తామని అమెరికా (America) మరోసారి హెచ్చరించింది. చైనా, భారత్, బ్రెజిల్ (Brazil), ఇతర దేశాలు రష్యా నుంచి చౌకగా చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయని, ఈ దేశాలు యుద్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకుంటున్నాయని ఆరోపించింది. రష్యాకు సహాయం చేసే దేశాలపై 500 శాతం వరకూ సుంకాలు విధించాలి. రష్యా- ఉక్రెయిన్ (Ukraine)యుద్ధాన్ని ముగించడానికి అంతిమ అవకాశం చైనా(China), భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై సుంకాలు విధించడమే. రాబోయే 50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యాపై 100 శాతం సుంకాలను అమలు చేయాలనే అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. వీటి లక్ష్యం పుతిన్ శాంతి ఒప్పందానికి వచ్చేలా చేయడమే అని సెనేటర్లు లిండ్స్ గ్రాహం, రిటర్డ్ బ్లూమెంటర్ స్పష్టం చేశారు.