America : అక్రమ వలసలకు సహకరించే భారత సంస్థలపై వీసా ఆంక్షలు

అగ్రరాజ్యంలోకి అక్రమంగా వలస వెళ్లేవారికి సహకరించే భారత ట్రావెల్ ఏజెన్సీ (Indian travel agency) లకు అమెరికా (America) విదేశాంగ శాఖ హెచ్చరిక జారీ చేసింది.అలాంటి సంస్థల యజమానులు, ఎగ్జిక్యూటివ్‌లు (Executives) , సీనియర్ అధికారులపై వీసా (Visa) ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించింది. అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా కార్యకలాపాల్లో ప్రమేయమున్న ట్రావెల్ ఏజెన్సీలను గుర్తించి, చర్యలు చేపట్టేందుకు కాన్సులర్ వ్యవహారాలు, దౌత్య భద్రతా సేవ విభాగాలు భారత్‌లోని అమెరికా కాన్సులేట్లు (American Consulates) , ఎంబసీతో కలసి పనిచేస్తున్నట్లు తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా వలస వస్తే ఎదురయ్యే ముప్పుల గురించి విదేశీయులకు అవగాహన కల్పించడంతోపాటు, తమ దేశ వీసా నిబంధనలను ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవడం కూడా అగ్రరాజ్య వలసల విధాన లక్ష్యమని పేర్కొంది.