US Visa : విద్యార్థులకు వీసా కష్టాలు …ఇంకా మొదలుకాని స్లాట్లు
భారతీయ విద్యార్థు (Students )ల్లో చాలామందికి అమెరికాలోని పలు టాప్ యూనివర్సిటీల్లో సీటు ఖరారైనప్పటికీ ఆ దేశానికి వెళ్లడానికి అవసరమైన వీసా (Visa) ప్రక్రియ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. మరికొద్ది వారాల్లో ఓరియంటేషన్ ప్రారంభం కానున్నదని కానీ ఎఫ్-1 వీసా (F-1 visa) అపాయింట్మెంట్ స్లాట్లు మాత్రం అందుబాటులోకి రాలేదని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. ఆరు నెలల నుంచి ఎఫ్-1 వీసాకు సంబంధించిన స్లాట్‌ను మూసివేసినట్టు సమాచారం. వీసా అపాయింట్మెంట్లు (Visa appointments ) ప్రారంభించారేమోనన్న ఆశతో రోజుకు పలుమార్లు యూఎస్ వీసా పోర్టల్ (US Visa Portal) ను చెక్ చేస్తున్నామని, కానీ తమ ఆశలు తీరడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అమెరికాలోని 15 టాప్ బిజినెస్ విద్యా సంస్థల్లో సీటు సాధించిన ఎంబీఏ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.







