US Supreme Court:వారిని మూడో దేశానికి పంపొచ్చు : అమెరికా సుప్రీంకోర్టు

వలసదారును వారి స్వదేశాలకు కాక ఇతర దేశాలకు తిరిగి పంపించే ప్రక్రియను అమెరికా సుప్రీంకోర్టు (US Supreme Court) మార్గం సుగమం చేసింది. వలసదారులను మూడో దేశానికి పంపడం వల్ల వారు ఎదుర్కొనే ప్రమాదాలను అధికారులకు చెప్పడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును తోసిపుచ్చింది. ఇది అక్రమాలకు వారు అనుభవించే ప్రతి ఫలమని కోర్టు వ్యాఖ్యానించింది. వలసదారుల బహిష్కరణలపై కఠిన వైఖరి అవలంభిస్తున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఊరటనిచ్చింది. ఈ కేసులో మయన్మార్ (Myanmar), దక్షిణ సూడాన్, క్యూబా(Cuba), మెక్సికో (Mexico), లావోస్, వియత్నాం దేశాలకు చెందిన ఎనిమిది మంది వలసదారులు ఉన్నారు. వీరిని మే నెలలో దక్షిణ సూడాన్‌కు వెళ్తు విమానంలో పంపించారు. అయితే వలసదారునలు మూడో దేశాలకు తరలిస్తే అక్కడ వారు హింసకు లేదా హత్యకు గురయ్యే అవకాశం ఉందన్న అప్పీళ్లను సుప్రీం కొట్టిపారేసింది. కోర్టు తీర్పు భయంకర మైనదని నేషనల్ ఇమిగ్రేషన్ లిటిగేషన్ అలయన్స్ తెలిపింది. ఈ నిర్ణయం తమ క్లయింట్లను హింసకు, మరణానికి గురిచేసిందన్నారు. ఈ తీర్పు అమెరికా ప్రజల భద్రత, రక్షణకు విజయమని హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది.