India:భారత్‌ను హెచ్చరించిన అమెరికా .. రష్యాతో

రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్, చైనాలపై 500 శాతం సుంకం విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మద్దతులో యూఎస్ సెనెట్‌లో దీనిపై బిల్లు తెస్తామని వెల్లడిరచింది. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే (Senator Lindsey) మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్ (Ukraine)కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తామని ప్రకటించారు. ఆ దేశం నుంచి చమురును భారత్, చైనాలు 70 శాతం కొనుగోలు చేస్తున్నాయని లిండ్సే తెలిపారు. ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని, ఈ బిల్లుపై ట్రంప్ కూడా ఆమోదం తెలిపారని వెల్లడిరచారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా (Russia) నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. ఇక ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే దేశాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు సమాచారం.