Biometric: బయోమెట్రిక్‌తో విదేశీయుల ట్రాకింగ్.. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ యోచన

అమెరికాలోకి ప్రవేశించే లేక అమెరికా (America) నుంచి నిష్క్రమించే విదేశీయులను ట్రాక్ చేసేందుకు బయోమెట్రిక్ (Biometric) ఫేషియల్ రికగ్నిషన్(ముఖ గుర్తింపు) నిబంధనలను పునఃప్రవేశపెట్టాలని అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) యోచిస్తున్నది. సంబంధిత ప్రతిపాదనను వైట్‌హౌస్ (White House)కు హోంల్యాండ్ సెక్యూరిటీ పంపించినట్లు తెలిసింది. ఆర్‌ఐఎన్:1651-ఏబీ12 నిబంధన వెంటనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. బయోమెట్రిక్ డాటా సేకరణ మౌలిక సదుపాయాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు మళ్లీ పునరుద్ధరించాలని అమెరికా భావిస్తున్నది. అమెరికా పౌరసత్వం లేని ప్రజలందరి ఫొటోలను వారు దేశంలోకి ప్రవేశించే సమయంలో లేదా దేశాన్ని వదిలిపెట్టే సమయంలో సేకరించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది.