Student visa: విద్యార్థి వీసాలకూ కాలపరిమితి ..అమెరికా కొత్త మెలిక!

విద్యార్థి వీసాల (Student visa )పైనా అమెరికా మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీసాల జారీకి సోషల్ మీడియా వెట్టింగ్‌ను కఠినంగా అమలు చేస్తున్న అగ్రరాజ్యం తాజాగా మరో మార్పు తీసుకురాలని భావిస్తోంది. ఈ వీసాలకూ కాల పరిమితి విధించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎఫ్-1 వీసా (F-1 visa)లపై అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు జే-1 వీసా (J-1 Visa)లపై వచ్చిన ఎక్స్ఛేంజ్ విజిటర్లకు డ్యురేషన్ ఆఫ్ స్టేటస్ వెసులుబాటు ఉంది. అంటే వారు ఎంతకాలం చదవాలనుకుంటే, ఇంటర్న్ షిప్‌లో పాల్గొనాలనుకుంటే అంతకాలం అగ్రరాజ్యంలో ఉండొచ్చు. ఎక్స్ఛేంజ్ విజిటర్లుగా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు (Professors) , స్కాలర్లు, స్పెషలిస్టులు (Specialists), ట్రైనీలు, ఇంటర్న్‌లు, ఫిజీషియన్లకూ ఈ సదుపాయం వర్తిస్తుంది. ఈ విధానంలోనే మార్పులు తీసుకొచ్చి కాల పరిమితి విధించాలని హోంలాండ్ (Homeland) విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పరిమిత కాల నివాస అనుమతితో కూడిన వీసాలను మంజూరు చేయాలని సూచించింది.