Andy Byrne : ఆస్ట్రోనామర్ కంపెనీ సీఈవో ఆండీ బైరన్ పై వేటు
అమెరికాకు చెందిన ఆస్ట్రోనామర్ కంపెనీ సీఈవో ఆండీ బైరన్ (Andy Byrne) పై వేటు పడింది. ఆ కంపెనీ అతన్ని సస్పెండ్ చేసింది. తాజాగా జరిగిన కోల్డ్‌ప్లే కన్సర్ట్ ప్రోగ్రామ్‌లో సీఈవో ఆండీ బైరన్, ఆ కంపెనీకి చెందిన హెచ్ఆర్ మేనేజర్ తో రొమాన్స్(Romance) చేస్తూ కనిపించాడు. బోస్టన్ (Boston ) లో జరుగుతున్న మ్యూజిక్ షో సమయంలో, ఆస్రోనామర్ కంపెనీకి చెందిన సీనియర్ ఉద్యోగులు (Employees) ఫుల్ రొమాన్స్ మూడ్‌లో ఉన్నారు.
కంపెనీలో చీఫ్ పీపుల్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న క్రిస్టిన్ కాబట్ (Christine Cabot) ను గట్టిగా హత్తుకుని సీఈవో ఆండీ బైరన్ డ్యాన్స్ చేశాడు. ఆ ఇద్దరూ తన్మయత్వంతో ఊగిపోయారు. అయితే కన్సర్ట్ షోకు చెందిన లైట్లు వాళ్లపై ఫోకస్ చేయగానే ఆ జంట సడెన్‌గా విడిపోయారు. ఒకరి నుంచి ఒకరు దూరం వెళ్లే ప్రయత్నం చేశారు. సీఈవో బైరన్ కిందకు వంగాడు. దీంతో ఆ మ్యూజిక్ షోలో పాట పాడుతున్న గాయకుడు ఆ ఇద్దరి మధ్య అఫైర్ ఉన్నట్లు తెలుస్తోందన్నాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న కంపెనీ, ఆ ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నది. సీఈవో ఆండీ బైరన్‌ను సస్పెండ్ చేస్తూ లీవ్ మీద పంపించింది.







