Zelensky :రష్యాతో శాంతి చర్చలకు సిద్ధం .. జెలెన్‌స్కీ ప్రకటన

రష్యాతో గత నెలలో నిలిచిపోయిన శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు తాము ఉన్నామని ఉక్రెయిన్ (Ukraine) ప్రకటించింది. రష్యా (Russia)తో వచ్చే వారం చర్చలు జరిపేందుకు అధికారిక ప్రతిపాదనను పంపినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ (Zelensky) ధృవీకరించారు. శనివారం రాత్రి ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. చర్చల ప్రతిపాదనను జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్డీసీ) కార్యదర్శి రుస్తెమ్ ఉమెరోవ్ (Rustem Umerov )రష్యా ప్రతినిధులకు అందించారని జెలెన్ స్కీ తన ప్రసంగంలో తెలిపారు. యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైన అని రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ ప్రతిపాదనకు రష్యా సానుకూలంగా స్పందించింది. శాంతికి తాము సిద్ధమేనని తెలిపింది. అయితే యుద్ధంలో లక్ష్యాలను సాధించడం తమకు కీలకమని పేర్కొంది. ఉక్రెయిన్ సమస్యకు శాంతిపూర్వక పరిష్కారం సాధించాలన్న తన కోరికను అధ్యక్షుడు పుతిన్ (Putin) గతంలో ఎన్నోసార్లు వెలిబుచ్చారు. ఇది సుదీర్ఘ ప్రక్రియ. దీనికి గట్టి ప్రయత్నం జరగాలి. అంత సులభం కాదు అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.