Texas: టెక్సాస్‌లో వరదల్లో 82కి చేరిన మృతుల సంఖ్య

అమెరికాలోని టెక్సాస్ (Texas)రాష్ట్రంలో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 82కి చేరింది. మరో 41 మంది గల్లంతయ్యారు. ఒక్క కెర్ కౌంటీ (Kerr County)లోనే అత్యధికంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 28 మంది చిన్నారులు ఉన్నారు. దాదాపు 850 మందిని రక్షించినట్లు అధికారులు ప్రకటించారు. గాడ్వలూప్ నది తీరాన ఉన్న బాలికల వేసవి శిబిరం వరదల్లో మునిగిపోవడంతో దాదాపు 27 మంది చిన్నారులు సమా ఒక కౌన్సిలర్ (Councilor ) మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.