Pakistan: సౌదీతో ఒప్పందంపై పాక్ గొప్పలు పోయిందా…? అఫ్గనిస్తాన్ దాడి చేసినా రియాక్షన్ లేదే..?

పాకిస్తాన్ (Pakistan) కు ఏమైంది..? ఏం చేసినా బెడిసి కొడుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తన భద్రత అవసరాల దృష్ట్యా పాకిస్తాన్.. యూఏఈతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంప్రకారం రెండు దేశాల్లో ఎవరిపైనా ఇతర దేశం దాడికి దిగినా.. రెండు దేశాలు కలిసి ఎదుర్కోవాలి. ఇదే విషయాన్ని పాకిస్తాన్.. పదేపదే అంతర్జాతీయ వేదికలపై పాడుతోంది. కానీ దానికంత సీన్ లేదని తేలిపోయింది. అఫ్గనిస్తాన్ (Afghanistan) దాడి చేస్తున్న సమయంలో యూఏఈ సాయం కోరిన పాక్ కు.. అరబ్ ఎమిరేట్స్ కీలక సమయంలో హ్యాండిచ్చింది.
పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ఇటీవల ఆఫ్ఘానిస్థాన్ పై పాక్ సైన్యం వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా సరిహద్దుల్లోని పాక్ చెక్ పోస్టులపై తాలిబాన్ సైనికులు విరుచుకుపడుతున్నారు. దాదాపు 60 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు తాలిబన్లు ప్రకటించారు. తాలిబన్ సైన్యం ధాటికి తట్టుకోలేక పాక్ సోల్జర్లు పరుగులు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఇటీవలి సైనిక ఒప్పందాన్ని గుర్తుచేస్తూ సౌదీ అరేబియా సాయం కోరింది.
తాజాగా అఫ్ఘానిస్థాన్ తో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో పాక్ ప్రధాన మంత్రి సౌదీ అరేబియా విదేశాంగ మంత్రికి ఫోన్ చేశారు. అయితే, ఈ దాడి విషయంలో పాకిస్థాన్ కు సాయం అందించేందుకు సౌదీ అరేబియా ఒప్పుకోలేదు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. సౌదీ నిర్ణయంతో పాకిస్థాన్ కు ఇబ్బందులు తప్పడంలేదు.