America: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో జరిగిన రోర్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రంలోని బోధన్ (Bodhan) కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. రాకాసిపేట గౌడ్స్ కాలనీకి చెందిన శంకర్ గౌడ్, నీరజ దంపతుల కుమారుడు పంజాలనీరజ్ గౌడ్ (Neeraj Goud ) (23) అమెరికాలోని న్యూ హెవెన్ సిటీ (New Haven City )లో ఎంఎస్ చదువుతున్నాడు. తన స్నేహితుడు శ్రీధర్‌తో కలిసి ఈ నెల 16న బ్రిడ్జిపోర్టు ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. దట్టమైన పొగమంచు ఆవరించడంతో కారు అదుపు తప్పి పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని దవాఖానకు తరలిస్తుండగా, నీరజ్‌గౌడ్ మార్గ మధ్యలో మృతి చెందాడు. శ్రీదర్(Sridhar) దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.