World Bank: ఆ ఒప్పందంలో మాది సహాయక పాత్రే : ప్రపంచ బ్యాంకు చీఫ్
భారత్-పాక్‌ల సింధు జలాల ఒప్పందం మనుగడ విషయంలో ప్రపంచ బ్యాంక్ కానీ ఇతర అంతర్జాతీయ సంస్థ కానీ మేమి చేయలేదని ప్రపంచ బ్యాంక్ (World Bank) అధ్యక్షులు అజయ్ బంగా (Ajay Banga) స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) తరువాతి పరిణామాలలో భారతదేశం- పాకిస్థాన్ (India-Pakistan)తో ఇంతకు ముందటి సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలిగింది. పలు నదుల ఆనకట్టల్లో నీటి మట్టాలను తగ్గించారు. ఈ క్రమంలో పాక్‌లో జల సంక్షోభం నెలకొంటోంది. ఇతరుల మధ్యవర్తిత్వం ఒక్కటే ఈ ఒప్పందం విషయంలో ఏదైనా చేయగలదేమో. ప్రపంచ బ్యాంక్ ఈ విషయంలో ఏమీ చేయలేదు, తమ పాత్ర ఏమీ ఉండదని ఆయన వివరించారు. ప్రపంచ బ్యాంక్ ముందుకు వస్తుంది. రాజీ కుదురుస్తుందని ఉహాగానాలు వెలువడుతున్నాయి. సమస్య పరిష్కారం అవుతుందని పాక్ ఆశిస్తోంది అయితే ఇప్పుడు తమ చేతుల్లో ఏమీ లేదని ఆయన వివరించారు.







