Pakistan :భారతీయులను కాపాడిన పాక్ అధికారికి పౌర పురస్కారం
గతేడాది జరిగిన హజ్‌యాత్ర లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తీవ్ర ఇక్కట్లు కలగడంతో 1300 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రాణాలకు తెగించి ఎందరో యాత్రికులను కాపాడిన పాకిస్థాన్ (Pakistan)కు చెందిన అధికారి ఆసిఫ్ బషీర్ (Asif Bashir) కు ఆ దేశం మూడో అత్యున్నత పౌర పురస్కారం సితారే ఇంతియాజ్ ప్రదానం చేసింది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) ఈ అవార్డును ఆయనకు బహూకరించారు. గతేడాది నిర్వహిచిన హజ్ యాత్ర(Hajj pilgrimage) కు ప్రపంచ దేశాల నుంచి ఎందరో యాత్రికులు హాజరయ్యారు. తీవ్రమైన ఎండలు, ఉక్కుపోత, వడగాలుల వల్ల వారిలో చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. 1,300 మందికి పైగా మృతిచెందినట్లు సౌదీ అధికారిక వర్గాలు ప్రకటించాయి.






