Zelensky :హమ్మయ్య… అమెరికా మా చేయి వీడలేదు : జెలెన్స్కీ
తమదేశానికి అమెరికా సైనిక సహాయాన్ని ఆపలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky) పేర్కొన్నారు. కష్టసమయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు అగ్రరాజ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. విదేశాలకు అగ్రరాజ్యం అందించే అన్ని రకాల సాయాలను 90రోజుల పాటు నిలిపేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతానికి అమెరికా తమ చేయి వీడ లేదని జెలెన్స్కీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు సాయాలను ఆపేస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో నేను ఆందోళనకు గురయ్యాను. కానీ, భగవంతుడి దయ వల్ల మాకు అందించే ఆయుధాలను అగ్రరాజ్యం ఆపలేదు అని జెలెన్స్కీ అన్నారు.
కాగా, రష్యా (Russia )తో యుద్ధంలో ఉక్రెయిన్ (Ukraine) తన సైనిక అవసరాల్లో 40 శాతం అమెరికాపైనే ఆధారపడిరది. ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీ, 988 మిలియన్ డాలర్ల సామగ్రిని అందచేస్తామని మాజీ అధ్యక్షుడు బైడెన్ (Biden) గతంలో ఉక్రెయిన్‌కు హామీ ఇచ్చారు. వాషింగ్టన్ నుంచీ కీవ్‌కు 2022 నుంచి ఇప్పటి వరకు 62 బిలియన్ డాలర్లు ఆయుధాలు, ఇతర సాయం అందించారు. ఉక్రెయిన్‌కు మరో 500 మిలియన్ డాలర్ల ఆయుధసాయం అందిస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం నాటి రక్షణ మంత్రి ఆస్టిన్ (Austin) ప్రకటించాడు.






