Indians: అమెరికా చిన్నారిని దత్తత తీసుకునే హక్కు .. భారతీయులకు లేదు

అమెరికా పౌరసత్వం కలిగిన తమ బంధువుల చిన్నారిని దత్తత తీసుకుంటామని ప్రయత్నించిన దంపతుల కు చుక్కెదురు అయ్యింది. ఆ చిన్నారిని దత్తత తీసుకునే ప్రాథమిక హక్కు భారతీయులకు లేదని బాంబే హైకోర్టు (Bombay High Court) స్పష్టం చేసింది. అందుకు ఇక్కడి చట్టాలు అంగీకరించవని, యూఎస్ చట్టాల ప్రకారం దత్తత తీసుకొని, ఆ తర్వాతే ఇక్కడి దత్తత విధానాన్ని పాటించాలని సూచించింది. విదేశీ పౌరసత్వం ఉన్న చిన్నారిని బంధువులు దత్తత తీసుకునే అంశానికి సంబంధించి జువెనైల్ జస్టిస్ యాక్టు లేదా సంబంధిత దత్తత నిబంధనల్లో ఎటువంటి నిబంధన లేదు అని జస్టిస్ రేవతి మోహితే డెరే (Revathi Mohite Dere), జస్టిస్ నీలా గోఖలే (Neela Gokhale ) ల ధర్మాసనం పేర్కొంది. అమెరికా చట్టాల ప్రకారం దత్తత తీసుకుని, ఆ తర్వాత భారత్‌కు తీసుకువచ్చేందుకు దత్తత అనంతరం విధానాన్ని పాటించాలని సూచించింది. ఈ దత్తత కోసం తన అసాధారణ అధికారాలను ఉపయోగించడానికీ నిరాకరించిన ధర్మాసనం సదరు పిటిషన్‌ను కొట్టివేసింది.