Netanyahu: ట్రంప్‌నకు నోబెల్ ఇవ్వండి .. నెతన్యాహూ ప్రతిపాదన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ (Netanyahu) ప్రతిపాదించారు. ఈ మేరకు నోబెల్ ప్రైజ్(Nobel Prize) కమిటీకి తాను పంపిన లేఖ ప్రతిని నెతన్యాహూ స్వయంగా డొనాల్డ్ ట్రంప్‌కు అందజేశారు. డొనాల్డ్ ట్రంప్‌తో విందులో పాల్గొనేందుకు నెతన్యాహూ వైట్‌హౌస్ (White House)కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఇరువురూ భేటీ అయ్యారు. అనంతరం ట్రంప్‌ను ఉద్దేశించి నెతన్యాహూ మాట్లాడుతూ మిస్టర్ ప్రెసిడెంట్ నోబెల్ శాంతి బహుమతికి మీరు అర్హులు. అది మీకు తప్పక దక్కుతుంది అన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఒక దేశం తర్వాత మరొక దేశంలో, ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతంలో శాంతిని నెలకొల్పుతున్నారు అన్నారు. నోబెల్ శాంతి బహుమతి కోసం సుదీర్ఘకాలంగా ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నడొనాల్డ్ ట్రంప్ తాజా ప్రతిపాదనపై నెతన్యాహూకు కృతజ్ఞతలు తెలిపారు. మీరు చాలా అర్థవంతంగా మాట్లాడారు. మీకు చాలా కృతజ్ఞతలు అన్నారు.