Nehal Deepak Modi: అమెరికాలో నీరవ్‌మోదీ సోదరుడు అరెస్ట్

భారతీయ బ్యాంకులను రూ.వేల కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ దీపక్ మోదీ (Nehal Deepak Modi) అరెస్టయ్యారు. భారత ప్రభుత్వం అప్పగింత అభ్యర్థన నేపథ్యంలో అమెరికా (America)లో ఈ అరెస్టు చోటుచేసుకుంది. రుణాల విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank)ను మోసం చేసిన కేసులో నేహల్ మోదీ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రదర్యాప్తు సంస్థలు చేసిన అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు (Red Corner Notice ) జారీచేసింది. దాంతో గత వారం అమెరికా పోలీసులు నేహల్‌ను అదుపులోకి తీసుకున్నారు. తనపై జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులను రద్దు చేసేలా అతడు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో తాజాగా అతడిని అరెస్టు చేశారు. అతడికి బెల్జియం పౌరసత్వం ఉంది.