NATO : భారత్‌కు నాటో హెచ్చరిక…రష్యాతో

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు రష్యా ను ఆర్థికంగా దెబ్బతీసేలా అమెరికా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా ఆ దేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడిరది. ఈ క్రమంలో మాస్కో (Moscow) వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 100 శాతం సుంకం విధిస్తామని భారత్ (India) తో సహా చైనా, బ్రెజిల్ దేశాలను నాటో హెచ్చరించింది. నాటో (NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె (Mark Rutte ) అమెరికా సెనెటర్లతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం. ఆయా దేశాలపై 100 శాతం సుకం విధిస్తాం. మాస్కోలోని ఆ వ్యక్తి (వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశిస్తూ) శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. మా పరిణామాలు ఈ దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. కాబట్టి వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin )కు వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్‌గా తీసుకోవాలని ఒత్తిడి తీసుకురండి. లేకుంటే మూడు దేశాలకు భారీ ఎదురుదెబ్బలు తగులుతాయి అని హెచ్చరికలు చేశారు.