Satya Nadella : నేను భారత్-అమెరికా అనుబంధానికి ప్రతీకను
తాను భారత్-అమెరికా మధ్యనున్న అనుబంధానికి ప్రతీకనని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) అన్నారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా సియాటిల్ (Seattle)లోని భారత కాన్సులేట్ జనరల్ బెల్ హార్బర్ సమావేశ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాషింగ్టన్ నూతన గవర్నర్ బాబ్ ఫెర్గూసన్(Bob Ferguson), సత్యనాదెళ్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ విద్య, వైద్యం, ప్రజాసేవ, చిరు వ్యాపారాల ఉత్పాదకత వంటి రంగాల్లో సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలనే విషయమై ఇరుదేశాల నాయకత్వాలు దృష్టి కేంద్రీకరించాయని కొనియాడారు. వాషింగ్టన్ గవర్నర్ ఫెర్గూసన్ మాట్లాడుతూ భారతీయులు (Indians) కేవలం వారి దేశాభివృద్ధికే కాకుండా ప్రపంచ దేశాల అభివృద్ధికి అద్భుతమైన తోడ్పాటు అందిస్తున్నారన్నారు. భారత్తో సంబంధాలు మరింత పెంచుకోవడానికి తాము ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. అమెరికా చట్టసబ సభ్యులు, ఉన్నతాధికారులు మాట్లాడుతూ అమెరికా అభివృద్ధిలో భారత సంతతి ప్రజల సహకారాన్ని కొనియాడారు.






