Microsoft:మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం … పాకిస్థాన్‌లో

మైక్రోసాఫ్ట్ (Microsoft) సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ (Pakistan)లో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో పాతికేళ్ల నుంచి పాకిస్థానీలకు అందుతున్న సేవలు నిలిచిపోతాయి. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ (Arif Alvi) స్పందిస్తూ, మైక్రోసాఫ్ట్ సేవల ముగింపును బట్టి దేశం ఇప్పుడు అనిశ్చితి సుడిగుండంలోకి జారుకుంటున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. నిరుద్యోగిత పెరుగుతున్నదని, ప్రతిభావంతులు విదేశాలకు వలసపోతున్నారని, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 7, 2000న మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్‌లోకి ప్రవేశించి అక్కడ డిజిటల్ అభివృద్ధి (Digital development)కి నాంది పలికింది. దాదాపు 25 ఏళ్లుగా కొనసాగిన ఈ భాగస్వామ్యాన్ని ఇప్పుడు సంస్థ ముగించింది.మైక్రోసాఫ్ట్ తన నిష్క్రమణకు సంబంధించిన స్పష్టమైన కారణాలను వెల్లడించకపోయినా, ఆర్థిక, రాజకీయ అస్థిరత, వాణిజ్య పరిస్థితులు సంస్థకు వెళ్లిపోవడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.