Jeff Bezos: అంగరంగ వైభవంగా బెజోస్ పెళ్లి సందడి

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos), జర్నలిస్టు లారెన్ సాంచెజ్ (Lauren Sanchez) వివాహం వెనిస్ గ్రాండ్ కెనాల్ (Venice Grand Canal) లో అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. సాధారణంగా పెళ్లి అనగానే సంగీత్, మెహందీ (Mehndi) గుర్తొస్తాయి. కానీ బెజోస్, సాంచెజ్ కాస్త డిఫరెంట్‌గా ఫోమ్ పార్టీ (Foam party )తో తమ పెళ్లి వేడుకలను మొదలుపెట్టారు. నురుగులో మునిగి తేలుతూ పార్టీ చేసుకుంటున్న బెజోస్, సాంచెజ్ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ వివాహం కోసం బెజోస్ దాదాపు రూ.470 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టిన వివాహం ఇదే అని తెలుస్తోంది.