Jaishankar: ఐదేళ్ల తర్వాత చైనా పర్యటనకు జైశంకర్.. దలైలామా అంశమే సమస్యా?

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar) ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనా పర్యటనకు సిద్ధమయ్యారు. జూలై 13 నుంచి 15 వరకు ఆయన సింగపూర్, చైనాల్లో పర్యటించనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. తొలుత సింగపూర్ చేరుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి, అధ్యక్షుడితో కీలక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం చైనాలోని టియాంజిన్‌లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) కాంక్లేవ్‌లో జైశంకర్ (Jaishankar) పాల్గొంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. 2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత జైశంకర్ చైనాకు వెళ్లడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ పర్యటన నేపథ్యంలో దలైలామా (Dalai Lama) అంశమే భారత్, చైనా సంబంధాల్లో ఇబ్బందిగా ఉందని చైనా పేర్కొంటున్నట్లు సమాచారం.