Israel: ఇజ్రాయెల్‌పై తమ దేశమే విజయం : ఖమేనీ

ఇజ్రాయెల్- ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇరాన్ (Iran ) సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తొలిసారి స్పందించారు. 12 రోజుల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ (Israel)పై తమ దేశమే విజయం సాధించిందని ఆయన ప్రకటించారు. అలాగే, అమెరికా (America) స్థావరాలపై దాడి చేయడం ద్వారా అగ్రరాజ్యానికి గట్టి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చామని వ్యాఖ్యానించారు. అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ నాశనమవుతుందని అమెరికా భావించడం వల్లే ఈ యుద్ధంలో జోక్యం చేసుకుందన్నారు. అయితే, ఈ యుద్ధం వల్ల అమెరికా ఎటవంటి ప్రయోజనం సాధించలేకపోయిందని ఎద్దేవా చేశారు.