Iran: ఇరాన్ పార్లమెంట్ కీలక నిర్ణయం

ఇజ్రాయెల్ తో కాల్పులు విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన 24 గంటల్లోనే ఇరాన్ (Iran) కీలక నిర్ణయం తీసుకొంది. ఇక మీదట అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ( ఐఏఈఏ)కు ఏమాత్రం సహకరించకూడదని నిర్ణయించింది. ఇరాన్ పార్లమెంట్ ఈ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేసింది. దీనికి ఆ దేశ సుప్రీం నేషనల్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడులను ఖండిరచడానికి అంతర్జాతీయ అణు శక్తి సంస్థ నిరాకరించింది. దీంతో విశ్వసనీయతను వేలానికి పెట్టినట్లైంది అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలిబాప్ (Mohammad Bagher Ghalibap) వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమ అణు కేంద్రాల భద్రతకు గ్యారెంటీ ఇచ్చే దాకా ఐఏఈఏ (IAEA)కు సహకారాన్ని నిలిపివేయాలని పార్లమెంట్ (Parliament) తీర్మానించింది.