Iran: ఆయనకు ఫ్లోరిడా నివాసం కూడా సేఫ్ కాదు : ఇరాన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) నకు ఇకపై ఆయన ఫ్లోరిడా నివాసం కూడా సురక్షితం కాదని ఇరాన్ పేర్కొంది. అధ్యక్షుడు సన్‌బాత్ (Sunbath) చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ఆయన్ను ఢీకొట్టవచ్చని హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) సలహాదారు జావద్ లారిజాని ఈ హెచ్చరిక చేశారు. ట్రంప్‌నకు ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్ ఇకపై సురక్షితం కాదని లారిజాని పేర్కొన్నారు. డ్రోన్ (Drone) దాడి సులభమైన పని అని వ్యాఖ్యానించారు.