Simran:అమెరికా వెళ్లిన భారతీయ యువతి అదృశ్యం

అమెరికాకు వెళ్లిన భారతీయ యువతి సిమ్రాన్ (Simran) (24) అదృశ్యమైంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అక్కడకు వెళ్లిన ఆమె ఆ క్రమంలోనే కనిపించకుండా పోయింది. సన్నిహితుల ఫిర్యాదు అందుకున్న న్యూజెర్సీ పోలీసులు (Police) గాలింపు మొదలుపెట్టారు. సిమ్రాన్ జూన్ 20న భారత్ (India) నుంచి న్యూజెర్సీ (New Jersey) కి చేరుకుంది. అయిదు రోజుల తర్వాత అదృశ్యమైంది. దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు ఆమెకు స్థానికంగా బంధువులు లేరని, ఇంగ్లిషు (English) కూడా రాదని గుర్తించారు. సిమ్రాన్ వద్ద ఉన్న ఫోను వైఫై ద్వారానే పనిచేస్తుందని, ఆమె ఆచూకి తెలుసుకునేందుకు భారత్‌లో ఉన్న కుటుంబసభ్యులను సంప్రదించనున్నట్లు వెల్లడిరచారు. సీసీటీవీ పుటేజీ (CCTV footage) పరిశీలించిన పోలీసులు ఓ చోట సిమ్రన్ తన ఫోను చూసుకుంటూ ఎవరికోసమో వేచిచూస్తున్నట్లు గుర్తించారు.