Ishaan Sharma : అమెరికాలో భారత సంతతి వ్యక్తి అరెస్ట్

అమెరికాలోని మియామి-ఫిలడెల్ఫియా విమానంలో తోటి ప్రయాణికుడితో గొడవకు దిగిన 21 ఏళ్ల భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మ (Ishaan Sharma )ను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రయాణికుడిని కొట్టినందుకు కేసు (Case) నమోదు చేశారు. ఘర్షణ అనవసరంగా మొదలైందని కీన్ రీవ్స్ (Kean Reeves) చెప్పాడు. విమానం (Airplane) ల్యాండైన వెంటనే అధికారులు శర్మకు సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. అతడి ముఖంపై గాటు పడిరదని, కొన్ని కుట్లు పడ్డాయని తెలిపారు. శర్మ, రీవ్స్ గొడవ పడుతుండగా తోటి ప్రయాణికులు వారిని ఆగాలంటూ కేకలు వేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. శర్మ తన గొంతు పట్టుకుని నులిమాడని, చంపుతానంటూ బెదిరించాడని రీవ్స్ చెప్పాడు. స్వీయ రక్షణ కోసమే ప్రతి దాడికి దిగాల్సి వచ్చిందన్నారు. జైలు (Jail) నుంచి శర్మను విడుదల చేయాలంటే 500 డాలర్ల పూచీకత్తు చెల్లించాల్సి ఉంటుంది.