Ind vs Eng: బూమ్రా షాక్ ఇస్తే అతనే దిక్కు..?

ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఓటమి పాలు కావడాన్ని అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక సోషల్ మీడియా వేదికగా జట్టు యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సమర్థవంతమైన బౌలింగ్ విభాగాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కెప్టెన్ ఐపీఎల్ ప్రేమ చూపించడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. ఐపీఎల్ లో తనతోపాటు ఆడిన ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ లను జట్టులో తీసుకున్నాడు కెప్టెన్ గిల్.
కానీ అర్షదీప్ సింగ్(Arshadeep Singh) ను మాత్రం పక్కన పెట్టాడు. ఇంగ్లాండ్ మైదానాల్లో అనుభవం ఉన్న అర్షదీప్.. గత రెండేళ్ల కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. కొత్త బంతితోపాటుగా పాత బంతితో కూడా స్వింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడు అర్షదీప్ సింగ్. ప్రసిద్ స్థానంలో అతనిని జట్టులోకి తీసుకోవాలని.. ఇక అతనితో పాటుగా ఆకాష్ దీప్ సింగ్ కూడా జట్టులోకి వస్తే మంచి ఫలితాలు ఉంటాయని అభిమానులు కోరుతున్నారు. అభిమన్యు ఈశ్వరన్ ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు సైతం వినపడుతున్నాయి.
మొదటి మ్యాచ్ లో ఫెయిల్ అయిన శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి(Niteesh Kumar Reddy) సమర్థవంతమైన ఆటగాడని.. కాబట్టి రెండవ టెస్టులో అతనిని ఎంపిక చేయాల్సిందేనని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం బ్యాటింగ్ లో నైనా అతను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. బౌలింగ్ విభాగం బలపడకపోతే 5-0 తేడాతో టెస్టులు ఓడిపోయిన ఆశ్చర్యం లేదంటున్నారు అభిమానులు. రెండో టెస్టుకు బూమ్రా సైతం అందుబాటులో ఉండే అవకాశం లేదనే ప్రచారం అభిమానులను కంగారు పెడుతోంది. మరి బౌలింగ్ విభాగం విషయంలో జట్టు యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.