America: అమెరికాలో 8 మంది భారత యువకుల అరెస్ట్
అపహరణ, వేధింపుల కేసుల్లో ఓ ఖలిస్థానీ ఉగ్రవాది సహా 8 మంది భారత సంతతి పౌరులను అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎఫ్బీఐ (FBI) అధికారులు అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి ఆరు తుపాకులు, వందల రౌండ్ల మందుగుండు సామాగ్రి, 15 వేల డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్బీఐ అదుపులోకి తీసుకున్న ఉగ్రవాది పవిత్తర్ సింగ్ బటాలా (Pavitra Singh Batala) జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఏ) వాంటెడ్ జాబితాలో ఉన్న నేరస్థుడు. నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ( బీకేఐ)లో సభ్యుడు. బటాలాను ఇటీవలే ఎన్ఐఏ (NIA) ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.







