Air India :ఐరాస సాయం తిరస్కరించిన భారత్

ఎయిరిండియా (Air India) విమాన ప్రమాద దర్యాప్తులో సాయం చేస్తామన్న ఐక్యరాజ్యసమితి (United Nations) విమానయాన దర్యాప్తు సంస్థ ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. కీలకమైన బ్లాక్ బాక్స్ (Black box) డేటాను విశ్లేషించడంలో జాప్యం జరుగుతోందని భద్రతా నిపుణులు అంటుండడం తెలిసిందే. జూన్ 13న స్వాధీనం చేసుకున్న కంబైన్డ్ బ్లాక్ బాక్స్ యూనిట్ స్థితి, జూన్ 16న దొరికిన కాక్‌పిట్ వాయిస్ (Cockpit voice) రికార్డర్‌తో సహా దర్యాప్తు గురించి సమాచారం లేకపోవడాన్ని వారు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తులో సాయం చేసేందుకు ఐరాస ముందుకొచ్చింది. భారత్‌లో ఉన్న తమ అధికారికి పరిశీలకుడి హోదా ఇవ్వాలని కోరింది. అందుకు భారత్ తిరస్కరించింది. 2014లో మలేషియా (Malaysia) విమాన ప్రమాదం, 2020లో ఉక్రేనియా జెట్‌లైనర్ కూలిపోయిన ఘటనల్లో దర్యాప్తులకు సాయపడేందుకు ఆ దేశల విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ పరిశోధకులను నియమించింది. ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత దర్యాప్తు అధికారులు ఫ్లైట్ రికార్డర్ డేటాను డౌన్‌లోడ్ చేసుకున్నట్టు పౌర విమానయాన శాఖ తెలిపింది.