Khalistani Terrorist : ట్రంప్ కార్యక్రమంలో ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణం సందర్భంగా ప్రముఖులతో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurupatwant Singh Pannu) ప్రత్యక్షమవడం ఆందోళనలకు కారణమైంది. ఈ పరిణామంపై భారత్ (India) తాజాగా స్పందించింది. తమ దేశ భద్రతకు సంబంధించిన అంశాలను అమెరికా వద్ద లేవనెత్తుతూనే ఉంటామని స్పష్టం చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలు ఎప్పుడు జరిగినా అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మా దేశ భద్రతపై ప్రభావం చూపే, భారత్ వ్యతిరేక ఎజెండాలపై ఆందోళనలను అక్కడి ప్రభుత్వం వద్ద లేవనెత్తడాన్ని కొనసాగిస్తాం అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) పేర్కొన్నారు.






