Ind vs Eng; ఆ ఇద్దరూ రావాల్సిందే.. కెప్టెన్ మిస్టేక్ అదే

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీం ఇండియా ఓటమి పాలైంది. 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత్(India) దే విజయం అనుకున్న మ్యాచ్ లో చేసిన తప్పులు.. జట్టు కొంప ముంచాయి. జట్టు ఎంపిక నుంచి ఫీల్డింగ్ వరకు ప్రతీ ఒక్కటీ భారత్ తప్పు చేసింది అనే చెప్పాలి. కీలకమైన సమయంలో వదిలేసిన క్యాచ్ లు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కెప్టెన్ గిల్(Shubhaman Gill) కూడా అవసరమైన సమయంలో సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, బౌలింగ్ కూడా సహకరించకపోవడం కొంప ముంచింది.
ముఖ్యంగా బౌలింగ్ విభాగం మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పాలి. బూమ్రా తప్పించి ఇతర ఏ బౌలర్లు జట్టుకు సహకరించలేదు అనే చెప్పాలి. సీనియర్ బౌలర్లు జడేజా, సిరాజ్ నుంచి ఏ మాత్రం బూమ్రాకు సహకారం లేదు. ఇక బూమ్రాకు బౌలింగ్ ఇవ్వాల్సిన సమయంలో కెప్టెన్ గిల్ ఇవ్వకపోవడం మైనస్ అయింది. ఈ మ్యాచ్ లో ప్రసిద్ కృష్ణ.. 5 వికెట్లు తీసినా.. వైట్ బాల్ క్రికెట్ మాదిరిగా పరుగులు ఇచ్చేసాడు. ఇది జట్టుకు మైనస్ గా మారిన అంశం. సిరాజ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసాడు.
దీనితో రెండో టెస్ట్ లో జట్టులో కీలక మార్పులు జరగాలనేది అభిమానులు కోరుతున్న అంశం. ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్ ఇద్దరూ జట్టులో ఉంటే మంచిది అనే భావన వ్యక్తమవుతోంది. ఇద్దరూ కీలక సమయంలో వికెట్లు తీసే సామర్ధ్యం ఉన్న ఆటగాళ్ళు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్ అయితే స్వింగ్ బౌలింగ్ తో ఆకట్టుకుంటాడు. అతనికి మాత్రం జట్టులో చోటు కల్పించలేదు. అతను ఉండి ఉంటే.. ఖచ్చితంగా జట్టుకు కలిసి వచ్చేది. రెండో ఇన్నింగ్స్ లో బూమ్రా ప్రభావం చూపకపోయినా అతని నుంచి మంచి ప్రదర్శన ఉండేది అంటున్నారు అభిమానులు. మరి రెండో టెస్ట్ లో అయినా అతనికి అవకాశం కల్పిస్తారో లేదో చూడాలి.