Shubhaman Gill: గిల్ నోట తెలుగు మాట.. క్రికెట్ లో సౌత్ డామినేషన్ పెరుగుతోందా..?

తగ్గుతూ రావడం అభిమానులకు నచ్చలేదు. అశ్విన్, సిరాజ్, రాహుల్ మాత్రమే ఈ మధ్య కాలంలో టీంలో ఎక్కువ కనపడుతూ వచ్చారు. అయితే ఇంగ్లాండ్ సీరీస్ తో మాత్రం పరిస్థితి మారింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. సౌత్ ఇండియా ఆటగాళ్లకు అన్ని విభాగాల్లో ప్రాధాన్యత క్రమంగా పెరిగింది.
ఓపెనర్ గా రాహుల్(KL Rahul) జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అతని సత్తా ఏంటో అర్ధమైంది. నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా ఆస్ట్రేలియా పర్యటన తర్వాత జట్టులోకి వచ్చాడు. బౌలింగ్ ఆల్ రౌండర్ గా అతను ప్రభావం చూపించేందుకు కష్టపడుతున్నాడు. ఇక యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో అవకాశం వచ్చిన ప్రతీసారి తన టాలెంట్ బయటపెడుతున్నాడు. రెండో టెస్ట్ లో అతని ప్రభావం కనపడింది. కరుణ్ నాయర్ తిరిగి భారత జట్టులోకి వచ్చేసాడు.
అతను కూడా తన ప్రభావం చూపించేందుకు కష్టపడుతున్నాడు. ఇక కొత్త ఆటగాడు సాయి సుదర్శన్ కూడా జట్టులో అరంగేట్రం చేసాడు. సిరాజ్ బౌలింగ్ విభాగంలో ఎంత కీలకమో రెండో టెస్ట్ లో ప్రూవ్ చేసుకున్నాడు. ఇలా జట్టులో కీలక ఆటగాళ్ళుగా సౌత్ ఇండియా ఆటగాళ్ళు ఉండటం ఈ మధ్య కాలంలో క్రికెట్ అభిమానులకు నచ్చేస్తోంది. ఇక మూడవ టెస్ట్ మొదటి రోజు.. శుభమన్ గిల్ తెలుగులో “బాగుంది రా మామ” వాట్ రా రెడ్డి” అదిరింది రా రెడ్డి అంటూ చేసిన కామెంట్స్.. స్టంప్ మైక్ లో వినిపించాయి. ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.