H1B visa: హెచ్ 1బీ వీసా జారీ ప్రక్రియ లో కీలక మార్పులు … ఇకపై వీటి ఆధారంగానే ఎంపిక
హెచ్-1బీ వీసా (H1B visa ) ల జారీ ప్రక్రియలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ట్రంప్ (Trump) కార్యవర్గం తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఓ ప్రతిపాదనను శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యూలేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ కార్యాలయానికి పంపింది. 2026 కోసం వార్షిక పరిమితికి తగినన్ని దరఖాస్తులు రావడంతో ప్రాసెస్‌ను నిలిపివేసినట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. దీంతో 2026 సంవత్సరానికి లాటరీవిధానం ఉండకపోవచ్చు. ప్రస్తుతం పరిమితి ఆధారంగా లాటరీ విధానంలో వీసా ( Visa) దారులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత ఆయా కంపెనీలు, తమకు వచ్చిన వీసాల్లో అక్టోబరు నాటికి విధుల్లో చేరాల్సిన కార్మికుల దరఖాస్తులనులాటరీ విధానంలో కాకుండా, సదరు పోస్టుకు ఆఫర్ చేస్తున్న వేతనం ఆధారంగా వీసాలు జారీ చేశారు. కంపెనీలు మరింత మంది ఉన్నత స్థాయి నిపుణులను నియమించుకునేలా ప్రోత్సహించేందుకు ఈ విధానం అమలు చేసినట్లు అప్పట్లో తెలిపారు.
2021లో జో బైడెన్ (Joe Biden) అధికారంలోకి వచ్చాక దీన్ని పక్కనపెట్టారు. ఇక తాజాగా డీహెచ్ఎస్ (DHS) పంపిన ప్రతిపాదన వల్ల హెచ్-1బీ ఉద్యోగులు తక్కువగా అందుబాటులో ఉంటారని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.వాస్తవానికి ఏ కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుండా ఈ లాటరీ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ పెద్ద పెద్ద కంపెనీలు అధిక దరఖాస్తులు చేసి ఎక్కవ వీసాలను దక్కించుకొంటున్నాయి. ఈ లాటరీ విధానాన్ని తొలగించాలని ఈ ఏడాది జనవరిలో ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రొగ్రెస్ అనే మేధోమథన సంస్థ సూచించింది. జీతం, సీనియార్టీ ఆధారంగా వీసాలు జారీ చేస్తే వాటి ఆర్థిక విలువ 88 శాతం పెరుగుతుందని తెలిపింది.







