Elon Musk: ఎలాన్ మస్క్ ఆందోళన.. కనీసం ముగ్గురు పిల్లల్ని

ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గుతుండడంపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో మహిళ (woman) కనీసం ముగ్గురు పిల్లల్ని(Three children) కనాలని పిలుపునిచ్చారు. అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను మస్క్ తరచూ తోసిపుచ్చుతుంటారు. ప్రపంచ దేశాల్లో తగ్గుతున్న జనాభా (Population) స్థాయిలను నిలబెట్టడానికి మహిళలు సగటున ముగ్గురు పిల్లలకు జన్మనివ్వాలని పేర్కొన్నారు. జనాభా తగ్గుదల తో అమెరికా (America) వంటి దేశాల్లో నాగరికత పతనమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. తన మాటలను నమ్మకపోతే మరో 20 ఏళ్లు వేచి చూడాలంటూ పేర్కొన్నారు. పరిస్థితి మెరుగుపడాలంటే ఒక్కో మహిళ కనీసం ముగ్గురికి జన్మనివ్వాలని పిలుపునిచ్చారు.