Elon Musk:ఎప్‌స్టీన్ పైళ్లు బయటపెట్టండి .. మస్క్‌పై ట్రంప్ కొత్త దాడి

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో తీవ్ర విబేధాలు ఎదుర్కొన్న టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చినట్లుగా లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein)కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎప్‌స్టీన్ గురించి మాట్లాడటం మానేయమని అందరికీ చెబుతూనే అర డజను సార్లు ఎప్‌స్టీన్.. ఎప్‌స్టీన్ అని చెప్పారు. ఆ ఫైళ్ల సంగతి తేలుస్తానన్నారు. నేను డిమాండ్ చేస్తున్నదొక్కటే ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా ఆ ఫైళ్లను విడుదల చేయండి అని ట్రంప్‌ను కోరారు. ఎప్‌స్టీన్ పైళ్లపై తన పరిపాలనను విమర్శించడం మానేయాలని మద్దతుదారులను ట్రంప్ కోరారు. తర్వాత మస్క్ స్పందించారు. మాజీ అధ్యక్షురాలు బరాక్ ఒబామా (Barack Obama) , జో బైడెన్ (Joe Biden), డెమొక్రాటిక్ నాయకురాలు హిల్లరీ క్లింటన్ ఎప్‌స్టీన్ ఫైళ్లను సృష్టించారు అని ఆరోపించిన సంగతి తెలిసిందే.