Baby Grok: పిల్లల కోసం బేబీ గ్రోక్ ప్రకటించిన ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( ఏఐ) కంపెనీ ఎక్స్ ఏఐ త్వరలోనే చిన్నారుల కోసం ప్రత్యేకంగా బేబీగ్రోక్ (Baby Grok) ను తీసుకురాబోతున్నది. ఈ యాప్ పిల్లల (Children’s)కు అనుకూలమైన కంటెంట్‌ను చూపుతుంది.అయితే, ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికాల్సి ఉంది. ఎక్స్ ద్వారా మస్క్ ఈ విషయాన్ని వెల్లడిరచారు. బేబీగ్రోక్‌ను చిన్నారుల విద్య (Education) , వినోదం కోసం రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఇది పిల్లల్లో ఏఐ (AI) వినియోగాన్నిపెంచేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని, కఠినమైన రక్షణ చర్యలు, క్యూరేటెడ్ కంటెంటెకు ప్రాధాన్యం ఇస్తూ దీనిని రూపొందిస్తున్నారు.