Chicago : షికాగో లో కాల్పుల కలకలం

అమెరికాలోని షికాగో (Chicago )లో కాల్పులు కలకలం రేపాయి. ఓ గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, 14 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు(Police) వెల్లడిరచారు. చికాగోలోని రివర్ నార్త్ (River North) పరిసరాల్లో ఉన్న ఓ రెస్టారెంట్ దగ్గర ఓ ఆల్బమ్ రిలీజ్ పార్టీ (Album release party) జరుగుతోంది. అదే సమయంలో అక్కడ లాంజ్‌లో ఉన్న వారిపై ఓ దుండగుడు కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసులు వెల్లడిరచారు. మొత్తం 13 మంది మహిళలు, ఐదుగురు పురుషులపై కాల్పులు జరగ్గా, వీరిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. బాధితుల వయసు 21-32 మధ్య ఉందని వీరిని స్థానిక ఆసుపత్రుల (Hospitals)కు తరలించినట్లు పేర్కొన్నారు.