Dalai Lama : భారత్‌తో బంధంలో ఓ సమస్య : చైనా

టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా (Dalai Lama) వారసుడి ఎంపిక విషయం చైనా భారత్ సంబంధాలలో ఓ సమస్యగా మారిందని భారత్ (India) లోని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది. భారత్‌లోని కొందరు వ్యక్తులు దలైలామా వారసత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ (You Jing) ఆరోపించారు. భారత విదేశీ వ్యవహారాల నిపుణులు టిబెట్‌కు సంబంధించిన సమస్యల సున్నితత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. దలైలామా పునర్జన్మ, వారసత్వం పూర్తిగా చైనా (China) అంతర్గత వ్యవహారమని, ఇందులో భారత్ కల్పించుకోవడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు.
2020లో గల్వాన్ (Galvan) ఘటనతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ (Jaishankar) చైనాలో తొలిసారి పర్యటించనున్నట్టు ఇటీవల ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో జైశంకర్ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా రాయబార కార్యాలయం నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం.