Olympics: లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028 … షెడ్యూల్ విడుదల

ప్రతిష్టాత్మక లాస్‌ఏంజెల్స్(2028) ఒలింపిక్స్ (Olympics)లో క్రికెట్ పోటీల తేదీలు ఖరారయ్యాయి. క్రికెట్ (Cricket)ను ఉన్న క్రేజ్‌ను దృష్టిలో నిర్వాహకులు మ్యాచ్‌లను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 2028 జూలై 12న క్రికెట్ మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్లో మొదలవుతాయి. జూలై 20, 29 తేదీల్లో మెడల్ మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషులు, మహిళల విభాగాల నుంచి మొత్తం 12 జట్లు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడతాయి. మ్యాచ్‌లన్నీ లాస్ ఏంజెల్స్ (Los Angeles)కు 50 కిలోమీటర్ల దూరంలోని పొమెనా(Pomena) నగరంలో జరుగుతాయి. ఈ శతాబ్దంలో తొలిసారి ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించారు.
సుదీర్ఘ విరామం అనంతరం జరుగబోతున్న క్రికెట్ పోటీల్లో మహిళలు, పురుషుల నుంచి మొత్తం ఆరేసి జట్లు టీ20 ఫార్మాట్‌లో జరుగనున్నాయి. మొత్తం 12 జట్లలో ఒక్కో జట్టు, 15 మంది చొప్పున ఆడేందుకు ఐవోసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఈసారి క్రికెట్‌తో పాటు బేస్‌బాల్ (Baseball)-సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్(సిక్సెస్) స్క్వాష్ క్రీడలకు కూడా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.