Dalai Lama: ఆ విషయాల్లో జోక్యం చేసుకోవద్దట.. భారత్‌కు చైనా హెచ్చరిక!

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) వారుసుడి ఎంపికపై నిర్ణయం తీసుకునే హక్కు ఆయనకే ఉందని భారత్ (India) ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా చైనా (China) విదేశాంగ శాఖ స్పందిస్తూ చైనా టిబెట్ విషయాల్లో భారత్ జోక్యం చేసుకోవడం తగదని, ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలని పరోక్ష హెచ్చరికలు చేసింది. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి టిబెట్ (Tibet) అంశాన్ని వాడుకోవడం భారత్ ఆపివేయాలని ఆశిస్తున్నామని పేర్కొంది. దలైలామా వారసుడిని ఆమోదించే హక్కు తమకు వారసత్వంగా కొనసాగుతోందని తెలిపింది.