Dinosaur : వేలంలో రూ.262 కోట్లు పలికిన అస్థి పంజరం

ప్రపంచంలోని ఏకైక బేబీ డైనోసార్ (Dinosaur) అస్థి పంజరం వేలంలో రూ.262 కోట్ల భారీ ధరకు అమ్ముడు పోయింది. న్యూయార్క్ (New York)లో సోత్ బే (South Bay )సంస్థ దీన్ని వేలం వేసింది. ఈ అస్థి పంజరాన్ని కొమ్ములు కలిగిన(ముక్కు కొమ్ము) డైనోసార్‌దిగా గుర్తించారు. 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటి లేట్ జురాసిక్ పీరియడ్ (Jurassic Period )కాలం నాటి జీవిగా దీన్ని భావిస్తున్నారు. ఈ డైనోసార్ అస్థి పంజరం 11 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తు ఉంది. దీన్ని 1996లో గుర్తించారు.