America:అమెరికాలో ఘనంగా బోనాల వేడుకలు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా (America)లో రెండు రోజులుగా ఆషాడ మాస బోనాల వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. న్యూయార్క్, ఇండియానాపోలీస్, షార్లెట్, న్యూజెర్సీ, అట్లాంటా, సియాటిల్, డల్లాస్, ఫిలడెల్ఫియా, పోర్ట్‌ల్యాండ్ వంటి పలు రాష్ట్రాల్లో బోనాల వేడుకలు (Bonala celebrations) ఘనంగా జరిగినట్లు అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఫైల్ల మల్లారెడ్డి (Mallareddy) , చైర్మన్ డాక్టర్ విజయపాల్‌రెడ్డి (Vijayapal Reddy) , అధ్యక్షుడు నవీన్‌రెడ్డి మల్లిపెద్ది తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవితారెడ్డి (Kavita Reddy) , జనరల్ సెక్రటరీ శివారెడ్డి కొల్లా, నర్సింహ పెరుక, వెబ్‌కమిటీ చైర్ నరేంద్రరెడ్డి యారవ, మీడియా డైరెక్టర్ దీపికారెడ్డి నల్లా తదితరులు పాల్గొన్నారు.