Birkin bag: ఈ బ్యాగ్ ధర అక్షరాలా రూ.86 కోట్లు!

దివంగత ఆంగ్లో- ఫ్రెంచ్ నటి జేన్ బర్కిన్(Jane Birkin) సొంతంగా తయారు చేయించుకున్న ఓజీ బర్కిన్ బ్యాగ్ ప్యారిస్ (Paris)లో జరిగిన వేలంలో 10.1 మిలియన్ డాలర్లు ( రూ.86,72,76,622) పలికింది. వేలం గదిలో అద్దాలపెట్టేలో బ్యాగ్ కనిపిస్తుండగా 1 మిలియన్ డాలర్లు (రూ.8.6 కోట్లు)తో బ్యాగ్ వేలంపాట మొదలైంది. గదిలో తొమ్మిది మంది కలెక్టర్ల మధ్య 10 నిమిషాల వ్యవధిలో అత్యంత ఉత్కంఠభరితంగా వేలం వార్ జరిగింది. చివరకు జపాన్ (Japan) కు చెందిన ఒక ప్రైవేట్ కలెక్టర్ బ్యాగ్‌ను దక్కించుకున్నారు. ఇందుకోసమని జపాన్‌కు చెందిన సౌత్‌బై కౌంటీ హెడ్ మయికో ఇచికవా వేలం రూమ్‌లో ఉండగా జపాన్ కలెక్టర్ ఆయనకు ఫోన్ చేయడం ద్వారా బిడ్డింగ్‌లో పాల్గొన్నారు. ఒక బ్యాగ్ ఇంత గొప్ప ధరకు అమ్ముడుపోవ డమనేది లగ్జరీ ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలస్తుందని సౌత్‌బైస్ వద్ద హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఫ్యాషన్ గ్లోబల్ హెడ్ మర్గోవా హలిమి తెలిపారు. ప్రస్తుతం బర్కిన్ బ్యాగ్‌ను వినియోగిస్తున్న సెలబ్రెటీల్లో విక్టోరియా బెకమ్, కిమ్ కర్దాషియాన్, నీతా అంబానీ(Nita Ambani), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , కరీనా కపూర్ ఉన్నారు.