Passport: పాస్ పోర్ట్ రెన్యువల్ చేసుకుంటున్నారా..? ఇవి కావాల్సిందే..!

పాస్పోర్ట్(Passport) రెన్యువల్ చేసుకోవడం అనేది ఇప్పుడు చాలా మందికి తల నొప్పిగా మారిన విషయం. ఏ రూల్స్ ఎలా చేంజ్ అయ్యాయో తెలియక కాస్త తికమక పడుతూ ఉంటారు. అసలు పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవడానికి ఏమేం కావాల్సి ఉంటుందో చూద్దాం. మీ పాస్‌పోర్ట్ పునరుద్ధరణను పూర్తి చేయడానికి ఈ దశలను అనుసరించండి:
ముందు పాస్‌పోర్ట్ సర్వీస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సేవా పోర్టల్ లాగిన్ చేసి.. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి, మీ ఇమెయిల్(Email), వ్యక్తిగత వివరాలను ఉపయోగించి మీ లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాస్పోర్ట్ రెన్యువల్ అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ అయి ఓవర్‌వ్యూ పేజీలో “పాస్‌పోర్ట్ రీ ఇష్యూ” ని ఎంపిక చేసుకోవాల్సి. కొత్తది లేదా రీ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందుకు గల కారణం ఎంచుకోవాల్సి ఉంటుంది.
పేజీలు అయిపోవడం లేదా గడువు ముగిసే ఆప్షన్ లేదంటే మీ వ్యక్తిగత వివరాలలో మార్పులను సెలెక్ట్ చేసుకుని.. అప్డేట్ చేసిన సమాచారంతో ఫాం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి రివ్యూ చేసుకుని.. ఆన్లైన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత “పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంట్” పై క్లిక్ చేయండి. మీకు సమీపంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (PSK), పోస్ట్ ఆఫీస్ PSK (POPSK) లేదా రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ (RPO)ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ అందుబాటులో ఉన్న ఆప్షన్స్ తో పే చేసుకోవచ్చు.
ఆ తర్వాత మీ అపాయింట్‌మెంట్ స్లాట్‌ను షెడ్యూల్ చేసుకోవాలి. అపాయింట్‌మెంట్ ఖరారు చేసిన రిసిప్ట్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ పత్రాలతో అందుబాటులో ఉన్న కార్యాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. వాటితో పాటుగా ఫోటోగ్రాఫ్ కూడా తీసుకు వెళ్ళాల్సి ఉంటుంది. బయోమెట్రిక్స్ తీసుకున్న తర్వాత.. పాస్పోర్ట్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంది. అవసరమైతే పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. అన్ని సందర్భాలలో ఇది అవసరం లేదు. మీ పాస్‌పోర్ట్ గడువు మూడు సంవత్సరాల క్రితం ముగిసినా లేదా మీ ప్రస్తుత చిరునామా మారినా ఇది తప్పనిసరి.
మీ పాస్‌పోర్ట్ అప్లికేషన్ స్టేటస్ ను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ సర్వీస్ పోర్టల్‌లోని “సర్వీసెస్” ట్యాబ్ కింద “ట్రాక్ అప్లికేషన్ స్టేటస్” సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ నెంబర్ లేదా ఫైల్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక మన దేశంలో పాస్పోర్ట్ రెన్యువల్ కు అవసరమైన పత్రాలు ఒకసారి చూస్తే.. పాత పాస్‌పోర్ట్ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. మొదటి, చివరి రెండు పేజీల సెల్ఫ్ డిక్లరేషన్ కాపీలు కావాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ అథారిటీ జారీ చేసిన ఏవైనా పత్రాలు కావాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, ఓటరు గుర్తింపు కార్డు, విద్యుత్, వాటర్ లేదా ఫోన్ బిల్లు గత 12 నెలల క్రితం నుంచి ఉండాలి. బ్యాంక్ పాస్‌బుక్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్ కావాలి. రెంటల్ అగ్రిమెంట్ కూడా కావాల్సి ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ అన్నీ కూడా అప్డేట్ చేసినవి కావాల్సి ఉంటుంది.